Chilukuru Balaji Temple: చిలుకూరు బాలాజీ టెంపుల్ లో 'వివాహ ప్రాప్తి' కార్యక్రమం రద్దు

  • చిలుకూరు ఆలయంలో ఏప్రిల్ 21న వివాహ ప్రాప్తి
  • గరుడ ప్రసాదం పంపిణీలో నిన్న ఇబ్బందులు తలెత్తాయన్న పూజారి రంగరాజన్
  • వివాహం కోసం ఎదురుచూసేవారు ఇళ్లలోనే ప్రార్థించుకోవాలని సూచన
Vivaha Prapti cancelled in Chilukuru Balaji Temple

హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయంలో రేపు (ఏప్రిల్ 21) నిర్వహించాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దయింది. బాలాజీ ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించాలనుకున్న వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేశామని ప్రధాన పూజారి రంగరాజన్ వెల్లడించారు. వివాహ ఘడియల కోసం ఎదురుచూస్తున్న వారు తమ ఇళ్లలోనే దైవ ప్రార్థన చేసుకోవాలని సూచించారు. 

అయితే, ఆదివారం సాయంత్రం జరగాల్సిన కల్యాణత్సోవం షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని, ఆ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని రంగరాజన్ చెప్పారు. సంతాన భాగ్యం కోసం తాము అందిస్తున్న గరుడ ప్రసాదం పంపిణీలో నిన్న తలెత్తిన ఇబ్బందుల వల్లే వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. 

కాగా, గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతాన యోగం కలుగుతుందన్న ప్రచారం జరగడంతో చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అంచనాలకు మించి భక్తులు రావడంతో ఆలయ నిర్వాహకులు నిస్సహాయత వ్యక్తం చేశారు. శని, ఆదివారాల్లో గరుడ ప్రసాదం పంపిణీని నిలిపివేశారు. ఈ ప్రభావం వివాహ ప్రాప్తి కార్యక్రమంపైనా పడింది.

More Telugu News